80 రైళ్ల రద్దు.. ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే బిగ్ అలర్ట్

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. గత మూడు రోజులుగా నాన్ స్టాప్‎గా వర్షం కురుస్తుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షం, వరదలకు రోడ్లు నదులను తలపిస్తుండటంతో రవాణ రంగం అతలాకుతలం అయ్యింది. కొన్ని చోట్ల రోడ్లపైకి భారీగా వరద నీరు చేరగా.. మరి కొన్ని చోట్ల వరద ఉధృతికి ఏకంగా రోడ్లే కొట్టుకుపోయాయి. 

వర్షాల ప్రభావం రైల్వే వ్యవస్థపైన పడింది. పలు ప్రాంతాల్లో వరదకు రైల్వే పట్టాలు కొట్టుకుపోయాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే భారీగా రైళ్లును రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే 80పైగా రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. కొన్నింటిని దారి మళ్లించడంతో పాటు మరికొన్నింటిని తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు. రైళ్ల రద్దుపై ద.మ రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్ స్పందించారు.రైల్వే నిలయం డిజాస్టర్ మేనేజ్మెంట్ కంట్రోల్ రూం నుంచి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు. 

Also Read :- ఏపీలో వర్ష బీభత్సం.. నిలిచిపోయిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్

ప్రయాణికులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్యాసింజర్ల భద్రత కోసమే రైళ్ళను రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులు, రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా చూస్తున్నామని తెలిపారు. 
వర్షాలు తగ్గిన తర్వాత ట్రాక్ పునరుద్దణ పనులు చేపడతామని స్పష్టం చేశారు. కాగా, భారీ వర్షాల వల్ల మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో ఏపీ, తెలంగాణ మధ్య రైళ్ల రాకపోకలు తీవ్ర అంతరాయం అయిన విషయం తెలిసిందే.  

రద్దైన రైళ్ల వివరాలు

విజయవాడ - సికింద్రాబాద్ 
సికింద్రాబాద్ - విజయవాడ
గుంటూరు - సికింద్రాబాద్ 
సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్ 
కాకినాడ ఫోర్ట్ - లింగపల్లి,
గూడూరు - సికింద్రాబాద్, 
భద్రాచలం -  బల్హర్ష
బల్హర్ష- కాజీ పేట్ 
భద్రాచలం - సికింద్రాబాద్ 
సికింద్రాబాద్ - భద్రాచలం
కాజీ పేట - డోర్నకల్
హైదరాబాద్ - షాలిమర్ 
సికింద్రాబాద్ - విశాఖ పట్నం 
విశాఖ పట్నం - సికింద్రాబాద్ 
హౌరా - సికింద్రాబాద్ ,
సికింద్రాబాద్ - తిరువనంతపురం ,
తిరువనంతపురం - సికింద్రాబాద్ ,
మహబూబ్ నగర్ - విశాఖ పట్నం,
లింగంపల్లి - CMT ముంబాయి,
CMT ముంబాయి - లింగంపల్లి,
కరీంనగర్ - తిరుపతి