ఎక్స్​ప్రెస్​ రైళ్లకు అదనపు జనరల్​ కోచ్​లు

సికింద్రాబాద్, వెలుగు : ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే 19 ఎక్స్​ప్రెస్​రైళ్లకు 66 అదనపు జనరల్​కోచ్ లను పెంచింది. ప్రతి రైలుకు ఉన్న రెండు జనరల్​బోగీలకు మరో రెండు బోగీలను అటాచ్​చేసింది. సికింద్రాబాద్, హైదరాబాద్, లింగంపల్లి, కాచిగూడ, గుంటూరు, నిజాముద్దీన్, తిరుపతి, కాకినాడ, మచిలీపట్నం

యశ్వంతపూర్, నాందేడ్, మధురై వంటి కీలక రూట్లలో తిరిగే ఎక్స్​ప్రెస్​రైళ్లన్నింటికి అదనపు జనరల్​బోగీలను జోడించారు. త్వరలో మరో 21 రైళ్లకు 80 అదనపు ఎల్​హెచ్​బీ జనరల్​కోచ్​లను అటాచ్​చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీటితో మొత్తం 40 రైళ్లకు 146 అదనపు జనరల్ క్లాస్ కోచ్లు పెరుగుతాయి.