సౌత్ సెంట్రల్ రైల్వే ఐజీ ప్రిన్సిపల్ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఆరోమా సింగ్

సికింద్రాబాద్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే ఐజీ- ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అరోమా సింగ్ ఠాకూర్ నియమితులయ్యారు. సోమవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలోని తన చాంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆమె చార్జ్ తీసుకున్నారు. ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్ 1993 బ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఆరోమా సింగ్ ఠాకూర్ ఇప్పటి వరకు వెస్టర్న్ రైల్వేలో ఐజీ ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా విధులు నిర్వహించి, బదిలీపై ఇక్కడకు వచ్చారు. మొదట హౌరాలో అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, జైపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, వడోదర రైల్వే స్టాఫ్ కాలేజీలో డిప్యుటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై లా మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బాధ్యతలు నిర్వహించారు. పలు ఇండియన్ పోలీసు మెడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు జబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్, హౌరా, ఝాన్సీ డివిజన్లలో ఆమె అందించిన సేవలకు అవార్డులు అందుకున్నారు.

ALSO READ :ఇన్​చార్జి తహసీల్దార్ల బదిలీలపై యూనియన్​ లీడర్​ కన్ను