తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంత కాలంగా నిలిచిపోయిన జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలను మళ్లీ అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. జూన్ 25నుంచి జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభమయ్యింది.
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో ఆధునికీకరణ పనుల కారణంగా రద్దు చేసిన ముఖ్యమైన రైళ్లను పునరుద్ధరించింది. విశాఖ నుంచి లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ (12805/2806), విజయవాడ - కాకినాడ పోర్ట్ (17257), చెంగల్పట్టు -కాకినాడ పోర్ట్ (17643) రైళ్లను ప్రయాణికులకు మళ్లీ అందుబాటులోకి తెచ్చింది.
నిడదవోలు - కడియం మధ్య ఆధునికీకరణ పనుల కారణంగా జూన్ 23 నుంచి ఆగస్ట్ 11 వరకూ పలు రైళ్లను ఇటీవల రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. వీటిల్లో ముఖ్యమైన జన్మభూమి, రత్నాచల్, సింహాద్రి ఎక్స్ ప్రెస్ వంటి సర్వీసులు ఉన్నాయి. దీంతో ప్రయాణీకుల విజ్ఞప్తి మేరకు వాటిని పునరుద్ధరిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొన్ని రైళ్లను మరో 2 నెలలపాటు పొడిగించింది.
- తిరుపతి - అకోల (07605)
- అకోల - తిరుపతి (07606)
- పూర్ణ - తిరుపతి (07609)
- తిరుపతి - పూర్ణ (07610)
- హైదరాబాద్ - నర్సాపూర్ (07631)
- నర్సాపూర్ - హైదరాబాద్ (07632)
- సికింద్రాబాద్ - తిరుపతి (07482)
- తిరుపతి - సికింద్రాబాద్ (07481)
- కాకినాడ టౌన్ - లింగంపల్లి (07445)
- లింగంపల్లి - కాకినాడ (07446)