దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయం లేకపోవడంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 31 రైల్వే స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆయా స్టేషన్ల పరిధిలో ఆదాయం, రద్దీ లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి 29 స్టేషన్లు మూతబడుతుండగా… ఏప్రిల్ 1 నుంచి మరో 2 స్టేషన్లు మూతబడతాయన్నారు. అయితే ఈ స్టేషన్లన్నీ కూడా తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో ఉన్నాయని తెలిపారు. ఒక్క స్టేషన్ మాత్రం మహారాష్ట్రలోని నాందేడ్ పరిధిలో ఉందని చెప్పారు.
సికింద్రాబాద్ పరిధిలో 16, గుంతకల్ పరిధిలో 3, నాందేడ్ పరిధిలో 1, గుంటూరులో 4, హైదరాబాద్‌లో 7 స్టేషన్లను మూసివేయనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఏయే రైల్వే స్టేషన్లలో ఆదాయం రావడంతో పాటు రద్దీగా ఉంటుందనే దానిపై దృష్టి సారించి తాత్కాలికంగా స్టేషన్‌నుల మూసివేతకు నిర్ణయం తీసుకుంది.