హైదరాబాద్, వెలుగు: యూనియన్బ్యాంక్ఆఫ్ఇండియా గురువారం సౌత్ సెంట్రల్ రైల్వేతో అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. హైదరాబాద్జోనల్ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో ఐఆర్పీఎస్ ప్రిన్సిపల్చీఫ్పర్సనల్ఆఫీసర్పి.కిషోర్ బాబు, ఐఆర్పీఎస్ చీఫ్పర్సనల్ఆఫీసర్ జి.ఆర్.ఎస్.రావు, యూబీఐ హైదరాబాద్జోన్చీఫ్జనరల్మేనేజర్కారె భాస్కర్ రావు, విజయవాడ జోన్జీఎం సీవీఎన్ భాస్కర్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కారె భాస్కర్రావు మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణలోని రైల్వే స్టేషన్లు, పరిసర ప్రాంతాల్లో మెరుగైన బ్యాంకింగ్సేవలు అందించేందుకే ఈ ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. యూబీఐ సూపర్శాలరీ అకౌంట్ కింద రూ.కోటి ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా, రూ.2 కోట్ల ఉచిత ఎయిర్యాక్సిడెంట్ఇన్సూరెన్స్ కవరేజీ, రూ.10లక్షల ఉచిత గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇతర బ్యాంకింగ్సేవలను వివరించారు. రైల్వే, బ్యాంక్ఉన్నతాధికారులు ఎంబీ మురళీధర్, అజయ్ కుమార్, రవి కుమార్, ఎం.అరుణ్ కుమార్, వివిధ ట్రేడ్ యూనియన్ల నాయకులు పాల్గొన్నారు.