సికింద్రాబాద్, వెలుగు: దసరా, దీపావళి పండుగలకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పలుమార్గాల్లో 24 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 9 వరకు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రతి శనివారం, తిరుపతి నుంచి సికింద్రాబాద్కు అక్టోబర్ 8 నుంచి నవం బర్ 12 వరకు ప్రతి మంగళవారం స్పెషల్సర్వీస్అందుబాటులో ఉంటుందని చెప్పారు.
అలాగే తిరుపతి, శ్రీకాకులం రోడ్ మధ్య అక్టోబర్ 6 నుంచి నవంబర్ 10 వరకు ప్రతి ఆదివారం, శ్రీకాకులం రోడ్, తిరుపతి మధ్య అక్టోబర్ 7 నుంచి నవంబర్ 11 వరకు ప్రతి సోమవారం స్పెషల్సర్వీసులు నడుస్తాయని చెప్పారు. ఇలా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 12 వరకు మొత్తం 24 స్పెషల్సర్వీసులు అందుబాటులో ఉంటాయని, ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించారు.