దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ కోటా ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్ సహా హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, నాందేడ్, గుంతకల్ డివిజన్‌లలో వివిధ విభాగాల్లో మొత్తం 61 ఖాళీలు భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 61
- సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్ - 31 (21+10)
- సికింద్రాబాద్ డివిజన్ - 05
- హైదరాబాద్ డివిజన్ - 05
- విజయవాడ డివిజన్ - 05
- గుంటూరు డివిజన్ - 05
- నాందేడ్ డివిజన్ - 05
- గుంతకల్ డివిజన్ - 05
అర్హతలు: ఉద్యోగాలను బట్టి పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అలాగే నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ (NAC) తప్పనిసరి.
వయోపరిమితి: 01/ 01/ 2025 నాటికి అభ్యర్థుల వయసు 18 నుండి 25 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: ఎస్‌సీ/ ఎస్‌టీ/ మహిళలు/ మైనారిటీలు/ ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన అభ్యర్థులు రూ. 250.. ఇతర అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తులు ప్రారంభ తేదీ: 04/ 01/ 2025
- దరఖాస్తులకు చివరి తేదీ: 03/ 02/ 2025
మరింత సమాచారం కోసం అభ్యర్థులు నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదవగలరు. నోటిఫికేషన్ కోసం South Central Railway Sports Quota Recruitment 2025 ఇక్కడ క్లిక్ చేయండి.