ప్రశాంతంగా రైల్వే ట్రేడ్​యూనియన్​ ఎన్నికలు

పద్మారావునగర్​, వెలుగు: సికింద్రాబాద్ రైల్వే కోచింగ్ డిపోలో సౌత్ సెంట్రల్ రైల్వే ట్రేడ్ యూనియన్ గుర్తింపు సంఘ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. ఐదు ట్రేడ్ యూనియన్లు పోటీలో ఉండగా, సాయంత్రం  6 వరకు పోలింగ్ జరిగింది. ఎస్​సీఆర్ఈఎస్​, ఎస్‌సీఆర్ఎంయూ సంఘాల మధ్య గట్టి పోటీ నెలకొందని పరిశీలకులు తెలిపారు.

 సంఘ జనరల్ సెక్రెటరీ మర్రి రాఘవయ్య పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్​సరళిని  పరిశీలించారు. సౌత్​ సెంట్రల్​ రైల్వే పరిధి కింద మొత్తం 7,8434 ఉద్యోగ సిబ్బంది ఓటర్లు ఉన్నారు. సికింద్రాబాద్​ రైల్వే కోచింగ్​ డిపో పోలింగ్ కేంద్రంలో మొత్తం 917 ఓటర్లు ఉన్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 11న ఉంటుందని ఎన్నికల పరిశీలకులు తెలిపారు.