సంక్రాంతికి 20 స్పెషల్ రైళ్లు..హైదరాబాద్ నుంచి కాకినాడ, తిరుపతి

సంక్రాంతికి 20 స్పెషల్ రైళ్లు..హైదరాబాద్ నుంచి కాకినాడ, తిరుపతి

హైదరాబాద్ నుంచి ఆంధ్రపదేశ్ లోని పలు ప్రాంతాలకు సంక్రాంతి పండుగకు వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది.  కాకినాడ టౌన్, తిరుపతికి డిసెంబర్ చివరి వారం నుంచి 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ట్రైన్ నం. ట్రైన్ నం. 07653 కాచిగూడ- కాకినాడ టౌన్  ట్రైన్ డిసెంబర్ 28, జనవరి 4,11,18,25 తేదీల్లో సాయంత్రం 8.30 గంటలకు కాచిగూడు నుంచి బయలు దేరుతుంది. మరసటి రోజు 8 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది.

ట్రైన్ నం. 07654 కాకినాడ టౌన్ -కాచిగూడ ట్రైన్.. డిసెంబర్ 29, జనవరి 5,12,19,26 తేదీల్లో సాయంత్రం 5.10 గంటలకు కాకినాడ టౌన్ లో బయలుదేరి మరుసరి రోజు ఉదయం 04.50 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. 

ట్రైన్ నం. 07509 హైదరాబాద్-  తిరుపతి ట్రైన్ డిసెంబర్ 28, జనవరి 4,11,18,25 తేదీల్లో సాయంత్రం 7.25 గంటలకు హైదరాబాద్ నుంచి బయలు దేరుతుంది. మరసటి రోజు 8.20 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

ట్రైన్ నం. 0510 తిరుపతి -హైదరాబాద్ ట్రైన్ డిసెంబర్ 29, జనవరి 5,12,19,26 తేదీల్లో రాత్రి 8.40 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసరి రోజు ఉదయం 08.40 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటుంది. 

కాకినాడకు వెళ్లే రైళ్లు కాచిగూడ నుంచి బయళుదేరి  మల్కాజ్ గిరి, నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లి గూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్ల ఆగుతూ కాకినాడ టౌన్ కు చేరుకోనున్నాయి. 

తిరుపతికి వెళ్లే రైళ్లు హైదరాబాద్( నాంపల్లి )నుంచి బయలుదేరనున్నాయి.  సికింద్రాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగనున్నాయి.