
హైదరాబాద్, వెలుగు: ఏపీలోని తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల డీజీపీల మీటింగ్ జరిగింది. మంగళవారం జరిగిన సమావేశానికి తెలంగాణ నుంచి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఐజీ సుమతితో పాటు మరో ముగ్గురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. టెర్రరిస్ట్ మాడ్యూల్ సమస్యలు, వ్యవస్థీకృత నేరాలు, డ్రగ్స్ అక్రమ రవాణా, అక్రమ ఆయుధాలు వంటి తదితర అంశాలపై ఈ మీటింగ్‌లో చర్చించారు. సుమతి మాట్లాడుతూ.. తెలంగాణలో నక్సలిజం తగ్గిందని, అంతర్గత భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.