కాంట్రవర్సీలపై ఎక్కువ ఫోకస్ చేయొద్దు: గవర్నర్

కాంట్రవర్సీలపై ఎక్కువ ఫోకస్ చేయొద్దు: గవర్నర్

కాంట్రవర్సరీ విషయాలపై ఎక్కువ ఫోకస్ చేయొద్దన్నారు గవర్నర్ తమిళి సై. ప్రస్తుతం సోషల్ మీడియా హవా పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరిపై సోషల్ మీడియా ప్రభావం ఉందని చెప్పారు. మీడియా ముందు ఎన్నో సవాళ్లు పెరిగాయన్న ఆమె  ప్రతీ రంగాన్ని టెక్నాలజీ ఓవర్ టేక్ చేస్తోందన్నారు.

కొంత మంది నేతలు మీడియాను అవేడ్ చేస్తున్నారని గవర్నర్ చెప్పారు. పొలిటికల్ రంగంలో మీడియా పాత్ర చాలా కీలకమని..  మీడియా ఎప్పుడు ప్రజల పక్షపతంగా ఉండాలని సూచించారు. రానున్న రోజుల్లో మీడియా రంగంలో మరిన్ని మార్పులు జరుగుతాయన్నారు.

సౌత్ ఇండియా మీడియా ఇండస్ట్రీ 15% గ్రోత్ నమోదు చేయడం మంచి పరిణామం అని అన్నారు గవర్నర్. సౌత్ పొలిటీషన్స్, సౌత్ మీడియాకి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందా లేదా అనే ప్రశ్నార్థకంగా మారిందన్నారు. 

యూపీలో గవర్నర్స్ కాన్ఫరెన్స్ లకు వెళ్ళినపుడు అక్కడ తనను గుర్తు పట్టక   రిసీవ్ చేసుకోలేదని చెప్పారు. మీడియా క్రెడిబిలిటీ ని మైంటైన్ చేయాలన్నారు.  జర్నలిస్టులకి ఫీల్డ్ లో ఉన్న కష్టాలు తనకు తెలుసన్నారు.

నాకు సౌత్ ఇండియా భాషలంటే ఇష్టం

ప్రస్తుత రోజుల్లో ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్, కొలాబరేషన్ అనేవి ముఖ్యమన్నారు నటి అక్కినేని అమల. మీడియా మన దేశ సంస్కృతిని కాపాడాలన్నారు. తనకు సౌత్ ఇండియా భాషలంటే ఇష్టమని.. నాలుగు సౌత్ ఇండియా భాషల్లో  పని చేశానన్నారు అమల.

హైదారాబాద్  కవాడిగూడ మ్యారియట్ హోటల్లో సౌత్ ఇండియా మీడియా సమ్మిట్ సీటన్ -4 కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్ర గవర్నర్ తమిళి సై , సినీ నటి అమలఅక్కినేని, విశాఖ ఇండస్ట్రీస్ ఛైర్మన్,  మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి కార్యక్రమానికి హాజరయ్యారు.