ఒక్క ఉద్యోగ ప్రకటన..సోషల్ మీడియాలో దుమారం..ఓ కన్సల్టింగ్ సంస్ధ ద్వారా షేర్ చేయబడిన ఈ పోస్ట్ తీవ్ర విమర్శలకు దారితీసింది.ఇది వివక్ష, వృత్తిపరంగా ఇది అస్సలు పనికి రాదని ఆగ్రహించేలా చేసింది.
South Indians are not allowed to apply for a job! pic.twitter.com/hTYVKkGPbs
— kannada yapper (@gotttillaa) December 13, 2024
నోయిడాలోని ఓ కన్సల్టెన్సీ.. లింక్డ్ ఇన్లో ఓ ఉద్యోగ ప్రకటన..డేటా అనలిస్ట్ పోస్ట్ కోసం 4యేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు అవసరం..ఇది టెక్నాలజీకి సంబంధిం చిన పోస్టు.. దక్షిణ భారత అభ్యర్థులు ఈపోస్టుకు అప్లయ్ చేసుకోవద్దు..వీరు అర్హులు కారంటూ ప్రకటనలో తెలిపింది. ఈ పోస్ట్ తీవ్ర విమర్శలకు దారితీసింది.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా దక్షిణ భారత దేశం నుంచి అటువంటి ఇంత పక్షపాతమా అంటూ ఆగ్రహం వ్యక్తం అయింది. నెటిజన్లు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రాంతీయ పక్షపాతానికి నిరసన తెలిపారు. రిక్రూట్‌మెంట్‌లో ఇంకా ఇలాంటి వెలుగులోకి రాని పక్షపాతం ఎలా ప్రబలంగా ఉంటుందో విమర్శకులు ఎత్తిచూపారు.