న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన పోస్కో గ్రూప్ మంగళవారం సజ్జన్ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో చేతులు కలిపింది. మనదేశంలో ఏడాదికి 5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో (ఎంటీపీఏ) సామర్థ్యం గల స్టీలు ప్లాంటును ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దీని కోసం రూ.40వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ప్లాంట్ పెట్టుబడి లేదా ప్రాంతం వివరాలను వెల్లడించలేదు.
పరిశ్రమ అంచనాల ప్రకారం, ఒక ఎంటీపీఏ గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్ట్‌కు దాదాపు రూ. ఎనిమిది వేల కోట్లు ఖర్చవుతుంది. జిందాల్, పోస్కో చైర్మన్ చాంగ్ ఇన్-హ్వాతోపాటు రెండు సంస్థల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల సమక్షంలో ముంబైలోని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ కార్పొరేట్ హెడ్‌క్వార్టర్స్‌లో ఎంఓయూపై సంతకాలు జరిగాయి. అవగాహన ఒప్పందంలో భాగంగా, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ పోస్కోలు ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీలు)కు సంబంధించిన బ్యాటరీ మెటీరియల్స్, ప్రతిపాదిత ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ క్యాప్టివ్ అవసరాలను తీర్చడానికి పునరుత్పాదక శక్తిని కూడా ఉత్పత్తి చేస్తాయి.