దక్షిణ కొరియాలో నదుల సందర్శన

  • బృందంలో స్పీకర్, శాసనమండలి చైర్మన్​ తదితరులు

వికారాబాద్, వెలుగు : సౌత్  కొరియా పర్యటనలో భాగంగా శుక్రవారం సియోల్  నగరంలోని హన్, చియాంగీచాన్  నదులను అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్  బండ ప్రకాశ్​ ముదిరాజ్, లెజిస్లేచర్  సెక్రటరీ వి నరసింహా చార్యులు సందర్శించారు.

సియోల్  నగరం మధ్య నుంచి ప్రవహించే హన్  నది గతంలో కాలుష్యంతో ఉండేదని, 20 ఏండ్ల కింద అక్కడి ప్రభుత్వం నదిని శుద్ధి చేసి పరిసరాలను సుందరంగా తీర్చిదిద్ది, మౌలిక వసతులు కల్పించడంతో పర్యాటక ప్రదేశంగా మారిందని అక్కడి అధికారులు వివరించారు.

అలాగే చియాంగీచాన్  నదీ వెంట సౌలతులు ఏర్పాటు చేయడంతో పర్యాటకంగా డెవలప్ అయినట్లు అక్కడి ప్రజలు, వ్యాపారులు శాసన బృందానికి తెలిపారు. సియోల్ లోని హాన్  నది, హైదరాబాద్ లోని మూసీ నది పరిస్థితి ఒకే మాదిరిగా ఉందని స్పీకర్​ ప్రసాద్​కుమార్​ తెలిపారు. మూసీ పునరుజ్జీవనంతో హైదరాబాద్  నగరం పర్యాటక ప్రదేశంగా మారుతుందని పేర్కొన్నారు.