
దక్షిణ కొరియాలో కార్చిచ్చు విధ్వంసం సృస్టించింది.చరిత్రలో కనీవినీ ఎరుగని వినాశనంతో దక్షిణ కొరియా విలవిలలాడుతోంది.దేశ దక్షిణ ప్రాంతమంతా మంటల్లో చిక్కుకుపోయింది. ఇల్లు, ఫ్యాక్టరీలు, స్కూళ్లు, దేవాలయాలు అన్నీ మంటల్లో కాలి బూడిదయ్యాయి. 24 మంది సజీవ దహనమయ్యారు. దాదాపు 27వేల మంది నిరాశ్రయిలయ్యారు. శతాబ్దాల చరిత్రగల రాజభవనాలు, బ్రిడ్జీలు ఆనవాళ్లు లేకుండా పోయాయి.దాదాపు 50వేల ఎకరాల అడవి మంటల్లో దహనమయ్యింది. దక్షిణ కొరియా చరిత్రలో అతిపెద్ద కార్చిచ్చు ఇది.
దక్షిణ కొరియాలో కార్చిచ్చుతో కాండవ దహనం చేసింది. భారీఎత్తున ఈదురు గాలుల తోడు కావడంతో మంటలు చెలరేగాయి. ఇళ్లు, కర్మాగారాలు, పురాతన బౌద్ధ దేవాలయం సహా 200 కి పైగా నిర్మాణాలను మంటల్లో కాలి బూడిదయ్యాయని జాతీయ అగ్నిమాపక సంస్థ బుధవారం(మార్చి26) ధృవీకరించింది.
వైల్డ్ ఫైర్ లో ఊయిసోంగ్ ప్రాంతమంతా మాడి మసిఅయ్యింది. ఆ ప్రాంతమంతా మండే అగ్ని గోళంగా మారింది. అగ్ని ప్రమాదంలో మొత్తం 24 మంది సజీవదహనమయ్యారు. వారిలో నలుగురు ఫైర్ సిబ్బంది కూడా ఉన్నారు. కార్చిచ్చు మంటలార్పుతున్న సమయంలో ఓ హెలికాప్టర్ మంటల్లో కూలిపోయి ఓ పైలట్ కూడా మృతిచెందాడు.శాంచియోంగ్‌లో వేగంగా విస్తరించిన మంటల కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రాణాల కోల్పోయారు. మరో 26మంది తీవ్రంగా గాయపడ్డారు.
ALSO READ | ముగ్గురు తాలిబాన్ అగ్ర నేతలపై బౌంటీలు ఎత్తేసిన అమెరికా
దక్షిణకొరియోలోని దక్షిణ ప్రాంతమైన గౌన్సాలో కూడా కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 7వ శతాబ్ధం నాటి బౌద్ద దేవాలయం, దాని చుట్టూ నిర్మాణాలు మంటల్లో ఆనవాళ్లు లేకుండా పోయాయి. వాటిలో గుర్తింపు పొందిన 1668 లో వాగుపై నిర్మించిన పెవిలియన్ ఆకారపు నిర్మాణం, 1904లో రాజు జోసెయోన్ రాజవంశం భవనం కూడా ఉన్నాయి.
సహాయక చర్యలు..
సౌత్ కొరియా చరిత్రలో ఎప్పుడూ లేనంతగా కార్చిచ్చు సృష్టించిన విధ్వంసానికి అక్కడి ప్రభుత్వం దిగ్భ్రాంతికి గురయింది. సైనికులు, ఎమర్జెన్సీ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టింది. కార్చిచ్చు చెలరేగిన ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. 130 హెలికాప్టర్లతో దాదాపు 5వేల ఫైర్ సిబ్బంది, ఆర్మీ, ఎమర్జెన్సీ టీంలతో సహాయక చర్యలు ముమ్మరం చేసింది. రాత్రిపూట బలమైన ఈదురు గాలులతో మంటల తీవ్రతరం అవుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఈ కార్చిచ్చుతో దక్షిణ కొరియాకు తీరని నష్టం వాటిల్లిందని తాత్కాలిక అధ్యక్షుడు హాన్ డక్ ప్రకటించారు.
వైల్డ్ ఫైర్ కు కారణం..
ఈ కార్చిచ్చులకు ఖచ్చితమైన కారణాలను ఇంకా తెలిసి రానప్పటికీ మానవ తప్పిదం ఇది జరిగి ఉండొచ్చని అక్కడి అధికారులు అనుమానిస్తున్నారు. స్థానికంగా ఓ సమాధికి సంబంధించిన పనుల్లో వెల్డింగ్ స్పార్క్‌ల వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ALSO READ | న్యూజిలాండ్ లో భారీ భూకంపం
మొన్నటికి మొన్న అమెరికాలోని కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ మొత్తం తగలబడిన విషయం తెలిసిందే. వేలాది ఇళ్లు కాలి బూడిదయ్యాయి..లక్షల కోట్లు నష్టం వచ్చింది. ఈ ఘటన మరిచిపోకముందే.. ఇప్పుడు దక్షిణ కొరియాలో కార్చిచ్చు మొదలైంది. ఊర్లకు ఊర్లు.. గ్రామాలకు గ్రామాలు తగలబడుతున్నాయి. ప్రతి ఇల్లు ఓ నిప్పుల కుంపటి అయ్యింది.
రాబోయే నాలుగు రోజుల్లో ప్రకృతి పరంగా షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుందని..ఈ కూటమి ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు పలువురు..కొన్ని నెలలుగా హెచ్చరిస్తున్నారు. ఆ కొంత మంది చెప్పినట్లు..కొందరు జ్యోతిష్య పండితులు చెప్పినట్లు..షష్ఠ గ్రహ కూటమి ఏర్పాటుకు 4 రోజుల ముందు..ఇలా దక్షిణ కొరియాలో కార్చిచ్చు రావటం చర్చనీయాంశం అయ్యింది. ఈ ప్రకృతి విపత్తు షష్ఠ గ్రహ కూటమి వల్లనేనా అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది.