సౌత్ కొరియాలో కార్చిచ్చు..24 మంది మృతి

సౌత్ కొరియాలో కార్చిచ్చు..24 మంది మృతి
  • 19 మందికి గాయాలు..పురాతన బౌద్ధ దేవాలయం బుగ్గి

సియోల్: సౌత్ కొరియాలో కార్చిచ్చు చెలరేగింది. మంటల కారణంగా ఇప్పటివరకు 24 మంది మృతి చెందారు. మరో 19 మందికి గాయాలయ్యాయి. అంతేకాక..1300 ఏండ్లనాటి పురాతన బౌద్ధ దేవాలయం కూడా బుగ్గిపాలైంది. 200లకు పైగా  ఇండ్లు, పరిశ్రమలు, వెహికల్స్ కాలిపోయాయి. అండోంగ్, ఉయిసియాంగ్ , సాంచియాంగ్ కౌంటీలతోపాటు ఉల్సాన్ సిటీలోనూ బుధవారం నాటికి 43 వేల ఎకరాలు కాలి బూడిదయ్యాయి. 

మంటలను ఆర్పేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గాలి కారణంగా మంటలు వేగంగా వ్యాపిస్తుండటంతో వాటిని అదుపు చేయడంలో అధికారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ కార్చిచ్చుపై దక్షిణ కొరియా ప్రధానమంత్రి, తాత్కాలిక అధ్యక్షుడు హన్ డక్- సూ స్పందించారు. మానవ తప్పిదమే కార్చిచ్చుకు కారణమని అధికారులు  అనుమానిస్తున్నారు.