దక్షిణ కొరియాలో ఓ షాకింగ్ వార్త వైరల్ గా మారింది. అక్కడ గుమి నగర కౌన్సిల్ ఆఫీస్ లో ఒక రోబో కౌన్సిల్ మెట్లదారిపై నుంచి పడిపోయింది. రోబో దానికిఅదే మెట్లపై నుంచి పడిపోయిందట. అయితే, రోబో ఆత్మహత్య చేసుకుందనే ప్రచారం జరుగుతున్నది. రోబో ఎందుకు పడిపోయిందని అధికారులు ఆర్చశ్య పోతున్నారు. దీంతో దక్షిణ కొరియా వాసులు రోబో ఆత్మహత్య చేసుకుందని చెప్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రోబో మెట్లపై నుంచి పడిపోవడానికి ముందు.. ఏదో వెతుకుతున్నట్టుగా అటూఇటూ తిరుగుతున్నదని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని, ముక్కలైన రోబో భాగాలను దానిని తయారుచేసిన కంపెనీకి పంపిస్తామని అధికారులు తెలిపారు. కాలిఫోర్నియాకు చెందిన ఓ కంపెనీ తయారుచేసిన ఈ రోబోను 2023 అక్టోబరు నుంచి గుమి నగర కౌన్సిల్‌లో వినియోగిస్తున్నారు. గతంలో వాషింగ్టన్‌లోనూ ఒక ఫౌంటెయిన్ వద్ద ఇదే రకంగా రోబో ధ్వంసమైంది. అది జారిపడి పాడైందని తర్వాత విచారణలో తేలింది.