
సౌత్ కొరియా మహిళా ఆర్చర్లు ఒలిపింక్స్‌లో తమ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నారు. విమెన్స్ టీమ్ ఈవెంట్‌లో వరుసగా పదో ఎడిషన్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. ఆదివారం జరిగిన గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో జియెన్ హున్యోంగ్, లిమ్ సిహ్యోన్, నామ్ సుహ్యోన్‌త 5–4తో చైనా జట్టుపై ఉత్కంఠ విజయం సాధించారు. దాంతో 1988లో మొదలైన కొరియా అమ్మాయిల స్వర్ణయాత్ర పారిస్ వరకూ సాగింది.