
సౌత్ కొరియా ఆర్మీ పొరపాటుతో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఒక చోట వేయాల్సిన బాంబులో మరో చోట పడటం కలకలం రేపింది. ఫైరింగ్ రేంజ్ దాటి బాంబులను వేసిన ఘటన స్థానికంగా ప్రజలను, ఆర్మీ అధికారులను తీవ్ర భయాందోళకు గురిచేసింది.
❗️Video emerges of ROKAF fighter’s accidental bombing in South Korea
— RT (@RT_com) March 6, 2025
Officials said eight bombs were "abnormally released" from a fighter jet during a live-fire military exercise. pic.twitter.com/GQBgA2p63h
సౌత్ కొరియాలో గురువారం (మార్చి 6) బార్డర్ లో ఆర్మీ ఎక్సర్ సైజ్ లో భాగంగా ఫైరింగ్ నిర్వహించారు. అయితే ఫైరింగ్ రేంజ్ కు ఔట్ సైడ్ లో 8 బాంబులు పడటంతో ఏడు మందికి తీవ్ర గాయాలయ్యాయి. అదేసమయంలో అక్కడే ఉన్న పెద్ద బిల్డింగ్ కూలిపోయింది.
ఈ ఘటనపై ఎయిర్ ఫోర్స్ అధికారులు స్పందించారు. KF-16 ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాద వశాత్తు MK-82 అనే 8 బాంబులను రిలీజ్ చేయడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. నార్త్ కొరియాకు దక్షిణాన ఉన్న బార్డర్ లో 25 కిలోమీటర్ల దూరంలో పొచియాన్ ప్రాతంలో ఉదయం 10 గంటలకు ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన వారికి ఆర్మీ ఆర్థిక సహాయం అందిస్తుందని, వైద్య ఖర్చులన్నీ భరిస్తుందని ప్రకటించారు. సౌత్ కొరియా-యూఎస్ జాయింట్ డ్రిల్స్ లో భాగంగా చేస్తున్న ఎక్సర్ సైజ్ లో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. గాయపడిన వారిలో నలుగురికి సీరియస్ గా ఉండగా, ముగ్గురు సురక్షితంగానే ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒక చర్చి, రెండు ఇండ్లు నేలమట్టం అయినట్లు సౌత్ కొరియన్ న్యూస్ ఏజెన్సీ యొన్హాప్ రిపోర్ట్ చేసింది.