భారతీయ సంస్కృతి... సంప్రదాయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. భారతదేశంలోని ఆచారాలు ... సంప్రదాయాలు ప్రత్యేకతను కలిగి ఉంటాయి. కానీ కొన్ని నిర్దిష్ట మార్గాల్లో పనులు ఎందుకు జరుగుతాయి అనే దాని గురించి మనం చాలా అరుదుగా ఆలోచిస్తాము. భారతీయ సంస్కృతి అనేక విశిష్టమైన ఆచారాలు .. సంప్రదాయాలతో నిండి ఉంది.
దక్షిణ కొరియాకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ బే యూన్-సూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన ఇండియన్స్ నుంచి ప్రశంసలను పొందాడు. ఈ వీడియోలో దక్షిణ భారత సాంప్రదాయ దుస్తులలో ధరించాడు. బేసిక్ కుర్తాతో పాటు తెల్లటి ధోతీని బంగారు అంచుతో చక్కగా ధరించి, తన భుజాలపై చక్కగా ఎంబ్రాయిడరీ చేసిన దుపట్టా ధరించాడు. ఇండియాలో పండుగల సమయంలో పూజ చేసేటప్పుడు మాత్రమే ఇలాంటి దుస్తులను ధరిస్తారు. బే యూన్-సూ ధరించిన దుస్తులు తిరుపతి నుంచి వచ్చాయనని పేర్కొన్నారు. ఇండియన్ ప్యాషన్.. సంప్రదాయాన్ని ఇష్ట పడుతున్నాను.. దానిని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపారు. నా బెస్ట్ ఫ్రెండ్ తల్లిదండ్రులు తిరుపతి నుండి ఈ అందమైన దక్షిణ భారత సంప్రదాయ దుస్తులను (ధోతీ & దుపట్టా/ పంచకట్టు) నాకు పంపారు. నేను చాలా కృతజ్ఞుడను! బాలాజీ భగవంతుని ఆశీస్సులు నాకు లభించాయి
ఈ వీడియోఉ ఇప్పటి వరకు ( వార్త రాసే సమయం వరకు) 1.8 మిలియన్ల వీక్షణలు వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. భారతదేశ సంప్రదాయాన్ని ఇష్టపడుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని ఒకరు రాశారు. మరొకరు మీరు ఈ బట్టల్లో చాలా అందంగా ఉన్నారని కామెంట్ చేశారు. ఇంకొకరు చాలా అద్భుతంగా కనిపిస్తున్నారని రాయగా... మరొక వ్యక్తి మీరు ఇప్పుడు భారతీయులు మిమ్మల్ని ఆధార్ సెంటర్ కు తీసుకెళ్లాలని రాశారు. భారతదేశంలో వేలాది సంప్రదాయాలు మరియు సంస్కృతి ఉన్నాయి మరియు వాటిలో కొన్ని బయటి వ్యక్తులకు ఆసక్తిని కలిగిస్తాయి.