- రుథీనియం కేటలిస్ట్ను వాడిన పరిశోధకులు
- ప్లాస్టిక్ పొల్యూషన్‌కు సరికొత్త సొల్యూషన్
హైదరాబాద్, వెలుగు : ప్రపంచ వ్యాప్తంగా అందరి జీవితాల్లో ప్లాస్టిక్ వినియోగం అనేది కామన్ అయిపోయింది. ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణానికి ఎంతో నష్టం వాటిల్లుతున్నది. ఆ ప్లాస్టిక్ పొల్యూషన్‌కు చెక్ పెట్టేందుకు పరిశోధనలు కొనసాగుతున్నాయి. ప్లాస్టిక్‌ను కరిగించి వాటితో రోడ్లేసే దానిపై ప్రయోగాలు జరుగుతున్నాయి. రీ సైక్లింగ్ వ్యవస్థలూ ఉన్నాయి. తాజాగా దక్షిణ కొరియాకు చెందిన సైంటిస్టులు.. ఆ ప్లాస్టిక్ నుంచే పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు తయారు చేస్తున్నారు.
దానికి కావాల్సిందల్లా కేవలం నీళ్లే. సౌత్ కొరియాకు చెందిన సియోల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ పరిశోధకులు ఈ దిశగా ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. దాదాపు 97శాతం వరకు ప్లాస్టిక్ వేస్టేజ్‌ను ఫ్యూయెల్‌గా మార్చారు. ప్లాస్టిక్, నీళ్లను కలిసి ఇంధనం తయారు చేస్తున్నారు.
ఎలా సాధ్యమైంది?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏటా 40 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతున్నది. అందులో ఎక్కువగా పాలీఓలిఫిన్ అనే రకం ప్లాస్టిక్ వాడకమే ఎక్కువగా ఉంటున్నది. ఆ ప్లాస్టిక్ వేస్ట్‌ను నీళ్లతో కలిపి రుథీనియం జియోలైట్ వై అనే కేటలిస్టులతో రియాక్ట్ అయ్యేలా చేశారు. కేటలిస్ట్ రియాక్షన్‌తో ఆ మిశ్రమంలోని నీళ్లు ప్లాస్టిక్‌ను పెట్రోల్, గ్యాసోలిన్, డీజిల్‌గా మార్చేలా చేశారు. ప్లాస్టిక్, రుథీనియం మిశ్రమంలో నీటిని కలపడంతో కార్బన్ ఎఫిషియెన్సీ పెరిగిందని గుర్తించారు. నీటితో ఆ మిశ్రమంలో చైన్ రియాక్షన్ మెకానిజమ్స్ మారిపోయాయని కనుగొన్నారు.
Also Read :- హుస్సేన్ సాగర్‌లో బోట్లకు మంటలు
అంతేగాకుండా, నీటిని యాడ్ చేయడంతో బొగ్గు ఎక్కువగా రాకుండా.. కేటలిస్టుల పనితీరు మరింత మెరుగుపడిందని తేల్చారు. ఆర్థికపరంగా కూడా ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదని అంటున్నారు. మామూలుగా అయితే ప్లాస్టిక్‌ను నియంత్రిత వాతావరణాల్లో కాల్చి రీసైకిల్ చేస్తుంటారని, అలా రీసైకిల్ చేయడం వల్ల పర్యావరణానికీ హాని కలుగుతుందని చెప్తున్నారు.