Spirit: సందీప్ వంగా..గట్టిగానే ప్లాన్ చేస్తున్నారే..? సౌత్ కొరియన్ సూపర్ స్టార్తో ప్రభాస్ ఢీ!

Spirit: సందీప్ వంగా..గట్టిగానే ప్లాన్ చేస్తున్నారే..? సౌత్ కొరియన్ సూపర్ స్టార్తో ప్రభాస్ ఢీ!

స్పిరిట్ (Spirit)..ఈ సినిమాను చాలా కాలం క్రితమే అనౌన్స్ చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga). ప్రభాస్ (Prabhas)హీరో కావడంతో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి.ఇక ఇటీవల వచ్చిన యానిమల్ మూవీ భారీ విజయాన్ని సాధించడంతో స్పిరిట్ లెక్కలు రోజురోజుకి మారుతున్నాయి. ప్రముఖ టాప్ బ్యానర్స్ టి-సిరీస్,భద్రకాళీ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా దాదాపు రూ.300కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కనుంది.ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందంట.ఈ ఏడాది చివర్లో డైరెక్టర్ వంగా ఈ సినిమాని షురూ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

నిజానికి సందీప్ రెడ్డి వంగ సినిమాలో హీరోలు యాటిట్యూడ్ అండ్ షార్ట్ టెంపర్ గా ఉంటారు.అదే మెయిన్ హైలెట్ అవుతుంది.ఇప్పుడు ప్రభాస్ కోసం కూడా అదే రేంజ్ క్యారెక్టర్ డిజైన్ చేసి ఉంటాడని ఫ్యాన్స్ ఆశగా ఉన్నాడు.ప్రభాస్ కటౌట్ కి యాటిట్యూడ్ మిక్స్ అయితే ఆ అవుట్ ఫుట్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడం చాలా కష్టం.అలాంటి హీరో పాత్రను ఢీ కొట్టాలంటే..ఎలాంటి కటౌట్ ఉంటే బాగుంటుందనే విషయంపై సందీప్ ఇంటర్నేషనల్ వైడ్ యాక్టర్స్ ను సెలెక్ట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. 

అలాంటి పవర్ ఫుల్ పాత్ర కోసం ప్రభాస్ కి ప్రతినాయకుడిగా హాలీవుడ్ యాక్టర్ ని సెలెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సౌత్ కొరియన్ యాక్టర్ 'ట్రైన్ టూ బూసాన్','మార్వెల్ సిరీస్ ఎటర్నల్'మూవీస్ లో కీలక పాత్రలలో నటించిన మా డాంగ్ సిక్ (Ma Dong-Seok) ని స్పిరిట్ మూవీ కోసం సంప్రదిస్తున్నారంట. ఎందుకంటే,ఈ మూవీ కాన్సెప్ట్ ఇంటర్నేషనల్ లెవల్ లో ఉండబోతోందంట.అందుకోసమే హాలీవుడ్ యాక్టర్ ని ట్రై చేస్తున్నట్లు సినీ సర్కిల్ లో వినిపిస్తోంది.సౌత్ కొరియాలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న యాక్టర్‌లలో డాంగ్ సిక్ ఒకరు. కాగా ఈ సినిమాను ఇండియన్ లాంగ్వేజెస్‌తో పాటు చైనీస్,జపనీస్ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నట్లు సందీప్ ముందుగా చెప్పారు.ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి వంగా కు ఉన్న క్రేజ్ కి వెయ్యి కోట్ల టార్గెట్ అంటే తక్కువే. అనుకున్న రేంజ్ లో గనుక స్పిరిట్ వచ్చిందంటే ఇండియా లెవల్లో ఏ స్టార్ కూడా కొట్టని రికార్డ్స్ కొట్టడం ఖాయం.మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.