సౌత్‌‌‌‌ జోన్‌‌‌‌ జూనియర్‌‌‌‌ అథ్లెటిక్స్‌‌‌‌ షురూ...

సౌత్‌‌‌‌ జోన్‌‌‌‌ జూనియర్‌‌‌‌ అథ్లెటిక్స్‌‌‌‌ ఛాంపియన్‌‌‌‌ షిప్‌‌‌‌ పోటీలు ఆదివారం హనుమకొండలోని జవహర్‌‌‌‌లాల్‌‌‌‌ నెహ్రూ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. తెలంగాణ అథ్లెటిక్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ ఆధ్వర్యంలో అండర్​14, 16, 18, 20 కేటగిరీల్లో జరుగుతున్న పోటీలకు తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్నాటక, పుదుచ్చేరి, లక్ష్యద్వీప్, కేరళకు చెందిన సుమారు వెయ్యి మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

పోటీలను డీవైఎస్‌‌‌‌వో అశోక్‌‌‌‌కుమార్‌‌‌‌ ఆదివారం ఉదయం ప్రారంభించారు. 60, 100, 800 మీటర్లు, 3, 4, 5 కిలోమీటర్లు, ట్రయత్లాన్, డెకత్లాన్, డిస్క్, జావెలిన్‌‌‌‌ త్రో, లాంగ్‌‌‌‌ జంప్‌‌‌‌, హైజంప్‌‌‌‌, షాట్‌‌‌‌పుట్‌‌‌‌ పోటీలు జరుగగా తమిళనాడు, కర్నాటక, తెలంగాణకు చెందిన క్రీడాకారులు మెడల్స్‌‌‌‌ సాధించారు. 17న పోటీలు ముగియనున్నాయి.‌‌‌‌   – హనుమకొండ, వెలుగు