పుదుచ్చెరి : ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన సౌత్ జోన్.. 9వ సారి దేవధర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. రోహన్ కున్నుమల్ (75 బాల్స్‌లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 107), కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (63), నారాయణ్ జగదీశన్ (54) చెలరేగడంతో.. గురువారం జరిగిన ఫైనల్లో సౌత్ జోన్ 45 రన్స్ తేడాతో ఈస్ట్ జోన్‌పై గెలిచింది. టాస్ గెలిచిన సౌత్ 50 ఓవర్లలో 328/8 స్కోరు చేసింది. రోహన్, మయాంక్ తొలి వికెట్‌కు 181 రన్స్ జత చేసి శుభారంభం ఇచ్చారు.
సాయి సుదర్శన్ (19) విఫలమైనా, నారాయణ్‌కు తోడుగా రోహిత్ రాయుడు (26), సాయి కిశోర్ (24 నాటౌట్) రాణించారు. తర్వాత ఛేజింగ్‌లో ఈస్ట్ జోన్ 46.1 ఓవర్లలో 283 రన్స్‌కే ఆలౌటైంది. రియాన్ పరాగ్ (95) టాప్ స్కోరర్. కుమార్ కుశాగ్ర (68), సుదీప్ కుమార్ (41) ఓ మాదిరిగా ఆడారు. వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు తీశాడు. రోహన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, పరాగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.