ట్రాన్స్ ఫార్మర్లపై కేటీఆర్ ​వ్యాఖ్యలు అవాస్తవం : సదరన్ డిస్కం

ట్రాన్స్ ఫార్మర్లపై కేటీఆర్ ​వ్యాఖ్యలు అవాస్తవం : సదరన్ డిస్కం
  • బీఆర్ఎస్ హయాంలో ఉన్నరూల్సే అమలు: సదరన్ డిస్కం

హైదరాబాద్, వెలుగు: ట్రాన్స్ ఫార్మర్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ అబద్ధమని సదరన్​డిస్కం వెల్లడించింది. విద్యుత్​లోడ్​పేరుతో హైదరాబాద్​అపార్ట్​మెంట్ వాసులపై రూ.300 కోట్లు అదనపు ఆర్థికభారం మోపుతున్నారని కేటీఆర్​చేసిన వ్యాఖ్యలు కరెక్ట్​ కాదని తెలిపింది. ఆయన కామెంట్స్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఓవర్ లోడ్ పేరుతో అపార్ట్​మెంట్ వాసులనే ట్రాన్స్​ ఫార్మర్లు పెట్టుకోవాలని ప్రభుత్వం చెప్తున్నట్లు వ్యాఖ్యలు సరికాదని సూచించింది.

2013 నాటి విద్యుత్ సవరణ చట్టం నిబంధనల ప్రకారం.. అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, అధిక లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉన్న ఇతర కనెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని గుర్తుచేసింది. 2013 నుంచి ఒకేరకమైన విధానం అమల్లో ఉన్నదని తెలిపింది. బీఆర్ఎస్ హయాంలోనూ ఈ రూల్సే అమలు అయ్యాయని డిస్కం అధికారులు వెల్లడించారు.

ఈ విధానం ద్వారా గడచిన 11ఏండ్లల్లో అపార్ట్​మెంట్​లో  ఏడాదికి 3,579 చొప్పున మొత్తం 38,790 ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. ఇప్పుడు కొత్తగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని కౌంటర్ ఇచ్చారు. పబ్లిక్ ట్రాన్స్​ఫార్మర్ లు  తక్కువ లోడ్ కలిగిన వ్యక్తిగత గృహా వినియోగదారులకు సరఫరాకు ఉద్దేశించినవి తెలిపారు. అపార్ట్​మెంట్​ వాసుల పై రూ.300 కోట్ల అదనపు ఆర్థికభారం పడుతుందనే ప్రచారం పూర్తిగా  అవాస్తవమని అధికారులు పేర్కొన్నారు.