జపాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్​పై 6.9 తీవ్రత

టోక్యో: జపాన్ లోని నైరుతి ప్రాంతంలో సోమవారం రాత్రి 9.19 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.9గా నమోదయింది. మియాజాకిలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీంతో మియాజాకి, క్యుషు ఐలాండ్ కు జపాన్  వాతావరణ శాఖ అధికారులు సునామీ అలర్ట్ ను జారీ చేశారు.

‘‘దేశంలోని నైరుతి ప్రాంతంలో భూకంపం వచ్చిన నేపథ్యంలో సునామీ కూడా సంభవించే అవకాశం ఉంది. మియాజాకి, క్యుషు ఐలాండ్ లో ప్రజలెవరూ సముద్రాలలోకి, తీర ప్రాంతాల వద్దకు వెళ్లవద్దు. కోస్టల్  ఏరియాలకు దూరంగా ఉండండి” అని అధికారులు ‘ఎక్స్’ లో హెచ్చరించారు. కోచి ప్రాంతంలోని కోస్టల్  సిటీ వాసులను కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. అయితే, భూకంపం వల్ల సంభవించిన నష్టంపై ఇంకా సమాచారం అందలేదని తెలిపారు.