పెళ్లి తర్వాత సౌత్ హీరోయిన్లు స్టార్స్‌గా కంటిన్యూ అవ్వలేరు అనే మాటని తప్పని ప్రూవ్ చేసింది సమంత. బ్రేకప్ తర్వాత డిప్రెషన్‌తో కెరీర్ డిస్టర్బ్ అవుతుంది అనే మాటనీ రాంగ్ అని చూపించింది. కెరీర్ మొదలుపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆమె క్రేజ్ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గిందే లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతోంది. తెలుగులో శాకుంతలమ్, యశోద.. తమిళంలో ‘కాత్తువాక్కుల రెండు కాదల్’తో పాటు అశ్విన్ శరవణన్ మూవీ చేస్తోంది సామ్. ఇక హిందీలో ఓ వెబ్ సిరీస్, ఒక సినిమా.. ఇంగ్లీష్‌లో ‘ద అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ కూడా చేస్తోంది.
ఇప్పుడు మరో చిత్రానికి కూడా కమిటైనట్లు తెలుస్తోంది. కార్తి హీరోగా సతీష్ సెల్వకుమార్ తెరకెక్కించనున్న తమిళ, తెలుగు బై లింగ్వల్ చిత్రం కోసం ఇటీవలే సమంతని అప్రోచ్ అయ్యారట. డిస్కషన్స్ నడుస్తున్నాయని, దాదాపు కన్‌ఫర్మ్ అయినట్టేనని టాక్. ఇంకా చాలా ప్రాజెక్ట్స్ విషయంలో సమంత పేరు వినిపిస్తోంది. ‘పుష్ప’లో ‘ఊ అంటావా ఊఊ అంటావా’ అంటూ అదరగొట్టిన ఆమె.. విజయ్ దేవరకొండ ‘లైగర్’లోనూ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలిసింది. త్వరలో ఓ స్టార్ హీరోకి జంటగా నటించనుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ సమంతకి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో చెప్పకనే చెబుతున్నాయి. ‘స్ట్రాంగ్ రోల్స్‌తో అందరికీ ఇన్‌క్రేజీ క్వీన్స్పైరింగ్‌గా నిలుస్తోంది’ అంటూ ప్రియమణి లాంటి సీనియర్ నటీమణుల నుంచి యంగ్ యాక్ట్రెస్‌ల వరకు అందరి నుంచి కాంప్లిమెంట్స్ కూడా కురుస్తున్నాయి.