ఎల్బీనగర్, వెలుగు: ప్రముఖ ట్రావెల్ సర్వీస్ ప్రొవైడర్ అయిన సదరన్ ట్రావెల్స్ దిల్‌సుఖ్‌నగర్‌లో నూతన బ్రాంచ్‌ను ఏర్పాటు చేసింది. నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా సదరన్ ట్రావెల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. తమ సంస్థ దేశ వ్యాప్తంగా సేవలు అందిస్తోందన్నారు.
దిల్సుఖ్ నగర్లో బ్రాంచ్ఓపెన్చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. 1970లో దివంగత ఆలపాటి వెంకటేశ్వరరావు న్యూఢిల్లీలో సదరన్ట్రావెల్స్ను ఏర్పాటు చేశారని, 4 మిలియన్లకు పైగా ప్రయాణికులకు సేవలు అందించామన్నారు. ఎప్పటికప్పుడు హాలిడే ప్యాకేజీలు అందిస్తున్నామని, వరల్డ్క్లాస్సేవలు అందించడమే తమ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం డెవలవ్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ జి.పాండు రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.