వచ్చే వారంలో సావరిన్​ గోల్డ్​బాండ్స్​ ఇష్యూ

వచ్చే వారంలో సావరిన్​ గోల్డ్​బాండ్స్​ ఇష్యూ

న్యూఢిల్లీ: వచ్చే వారంలో సావరిన్​ గోల్డ్​ బాండ్స్​ ఇష్యూ మొదలవనుంది. ఈ ఫైనాన్షియల్​ ఇయర్​లో మొదటిదైన ఈ సావరిన్​ గోల్డ్​ బాండ్స్​ ఇష్యూ కింద గ్రాము బంగారానికి రూ. 5,926 రేటును ప్రభుత్వం నిర్ణయించింది. 2023–24 సావరిన్​ గోల్డ్​బాండ్స్​ ఇష్యూ మొదటి ట్రాంచ్​ఈ నెల 19 న మొదలయి ఇదే నెల 23 న ముగియనుంది. రెండో ట్రాంచ్​ సావరిన్​ గోల్డ్​ బాండ్స్​ ఇష్యూ సెప్టెంబర్​ 2023 లో రానుంది. 

2015 లో సావరిన్​ గోల్డ్​ బాండ్స్​ ఇష్యూ మొదలయినప్పటి నుంచి ఇప్పటిదాకా రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా మొత్తం రూ. 30 వేల కోట్లను వాటి నుంచి సమీకరించినట్లు మిల్​వుడ్​ కేన్​ ఇంటర్నేషనల్​ సీఈఓ నిష్​ భట్ చెప్పారు. గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే రిటెయిల్​ ఇన్వెస్టర్లకు ఇదొక మంచి అవకాశమని అన్నారు. ఒక గ్రాము నుంచి 4 కిలోల దాకా పెట్టుబడులను సావరిన్​ గోల్డ్​బాండ్స్​ ఇష్యూ కింద పెట్టొచ్చు. బాండ్స్​ డీమెటీరియలైజ్డ్​రూపంలో ఉండటంతో వాటి నిర్వహణ చాలా సులభమవుతుంది.