న్యూఢిల్లీ: జీఎంఆర్ గ్రూప్‌కు అబుదాబీకి చెందిన సావరిన్ వెల్త్ఫండ్ఏడీఐఏ నుంచి రూ.6,300 కోట్ల పెట్టుబడి సమకూరింది. ఈ డబ్బుతో ప్రమోటర్‌గ్రూప్ ఎంటిటీ జీఎంఆర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్(జీఈపీఎల్) అప్పులు తీర్చుతారు.
ఏడీఐఏ నుంచి పెట్టుబడి వస్తుందని గ్రూప్ గతేడాది అక్టోబరులోనే ప్రకటించింది. ఆప్టికల్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్ రూపంలో ఈ నెల ఏడున పెట్టుబడి అందిందని జీఎంఆర్ఇన్ఫ్రా ప్రకటించింది. ఇది జీఈపీఎల్ పూర్తి యాజమాన్యంలోని సబ్సిడరీ.
ఈ ప్రమోటర్గ్రూపు జీఎం రావు కంట్రోల్లో ఉంటుంది. షేర్ల తనఖా పెట్టి తెచ్చిన అప్పును తీర్చడానికి ఈ డబ్బును వాడతామని జీఈపీఎల్ తెలిపింది. ఢిల్లీ, హైదరాబాద్, గోవాతో పాటు ఫిలిప్పైన్స్, ఇండోనేసియాలో ఎయిర్‌పోర్టులను జీఎంఆర్గ్రూప్ నిర్వహిస్తోంది.