భైంసా, వెలుగు: వైరస్ సోకి పంట నష్టపోయిన సోయా రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి శుక్రవారం డిమాండ్ చేశారు. భైంసాలో ఏడీఏ వీణకు వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ కేడీఎస్, ఈగల్ కంపెనీలకు చెందిన సోయా విత్తనాలు వేసి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఆ కంపెనీలపై చర్యలు తీసుకొని, తక్షణమే నష్టపరిహారం అందించాలన్నారు.
లేనియేడల బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మల్లేశ్వర్, పోశెట్టి, సంపత్ పటేల్, రఘువీర్, నందు భయ్యా, లక్ష్మణ్, అనిల్, రైతులు తదితరులున్నారు.