
జన్నారం, వెలుగు: వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 375కు పైగా ఎంపీ స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టిస్తుందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. మంగళవారం జన్నారం, బాదంపెల్లి, ధర్మారం గ్రామాల్లో రూ. 50 లక్షల ఈజీఎఫ్ నిధులతో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ సర్కార్ సర్పంచులకు నిధులు మంజూరు చేయలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చేపట్టిన యాత్రను కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం సరైంది కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి మరోసారి ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.