కాంగ్రెస్ కు మాజీ MLA సోయం బాపూరావు గుడ్ బై

రాష్ట్ర కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేత సోయం బాపురావ్ కాంగ్రెస్ ను వీడనున్నారు. మొన్నటి  ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయిన బాపురావ్ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో  ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు. ఐతే… కాంగ్రెస్ హైకమాండ్  రాథోడ్ రమేష్ కు టికెట్ కేటాయించింది. టికెట్ ఆశించిన బాపురావ్ మనస్తాపానికి లోనయ్యారు. బీజేపీలో చేరి… ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి ఆదిలాబాద్ పార్లమెంటులో ఎస్టీ  సామాజికవర్గంలో బలమైన నాయకుడు లేకపోవడంతో సోయం బాపురావ్ కే సీటు ఇస్తారని ఆయన అనుచరులు చెప్తున్నారు.