ఆందోళనలో సోయాబీన్​ నూనె గింజల రైతులు.. ఎందుకంటే

ఆందోళనలో సోయాబీన్​ నూనె గింజల రైతులు.. ఎందుకంటే

నూనెగింజల ఉత్పత్తిపై  రైతుల్లో నిరాసక్తత వ్యక్తమవుతోంది. ఈ వానాకాలం సీజన్‌లో ఆయిల్‌పామ్‌, సోయాబీన్‌  నూనె గింజల ధరలు  గణనీయంగా తగ్గడం ఆందోళనకరంగా మారింది. ఇది నూనె ఉత్పత్తులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సోయాబీన్‌ వంటి నూనెగింజల ధర.. మద్దతు ధర లేకపోవడం రైతులు ఆందోళన చెబుతున్నారు.

మహారాష్ట్ర మండీల్లో ఉల్లి రైతులే కాదు.. సోయాబీన్​ రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏడాది సోయాబీన్‌కు ఎంఎస్‌పి కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు.సోయాబీన్  నూనెగింజలు పంట పండించిన రైతులకు ఎంఎస్పీ ధర కూడా రావడం లేదని మదన పడుతున్నారు అన్నదాతలు. మహారాష్ట్రలోని లాసల్‌గావ్ వించూర్‌ మండీలలో సోయాబీన్​ ధర రోజూ 3 వేల రూపాయిల నుంచి 3,500 రూపాయిలు వరకు ఉండేది.  జూన్​ 5న రూ. 2,250 మాత్రమే ఉండటంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.

సోయాబీన్ పండించిన మహారాష్ట్ర రైతులు కేంద్రప్రభుత్వంపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. అమాంతంగా ధరలు పడిపోవడంతో రైతన్నలు ఆందోళనలో ఉన్నారు.  మహారాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ బోర్డు ప్రకారం, జూన్ 5 న 62 మండీలలో సోయాబీన్ వేలంలో ....ఆరుగురి  రైతులకు మాత్రమే MSP స్థాయి  గరిష్ట ధర లభించింది.  చాలా మండీలలో సోయాబీన్ ధర క్వింటాల్‌కు రూ.4000 ఉండగా, ఎంఎస్‌పీ క్వింటాల్‌కు రూ.4600గా ఉంది. ఈ ఏడాది సోయాబీన్ సాగు చేయడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోయాబీన్ నూనెగింజల పంట కావడంతో సోయాబీన్‌కు మంచి ధర రావాల్సి ఉన్నా ...ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో గిట్టుబాటు ధర రావడం లేదనిరైతులు వాపోతున్నారు. పర్భానిలోని సెలు మండిలో కందిపప్పు కనీస ధర క్వింటాల్‌కు రూ.2250 మాత్రమే ఉండగా... 182 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. 

మహారాష్ట్రలోని లాసల్‌గావ్ విన్‌చూర్‌లలో, సోయాబీన్ ధర స్థిరంగా రూ. 3000 నుండి రూ. 3500 మధ్య ఉంది, ఇది MSP కంటే చాలా తక్కువ. వ్యవసాయ మార్కెటింగ్ బోర్డు లెక్కల ప్రకారం జూన్ 5న కేవలం 378 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి.ఏ మార్కెట్‌లోనూ 10 వేల క్వింటాళ్లకు మించి రాకపోవడంతో ధర తక్కువగా ఉంది. సోయాబీన్  పప్పుధాన్యాలు , నూనెగింజల పంట, అయినా.. మంచి ధర లభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జూన్ 5న లాసాగావ్ మార్కెట్‌కు 378 క్వింటాళ్లు వచ్చాయి. ఇక్కడ సోయాబీన్  క్వింటాల్ ధర రూ.3500,...షాహదా మండికి 28 క్వింటాళ్ల సోయాబీన్ వచ్చింది. ఇక్కడ క్వింటాల్  ధర రూ.3951, ...సాయిలు మండిలో కందిపప్పు ధర రూ.2250,రహత మండిలో సోయాబీన్ ధర రూ.4410 గా ఉంది.