సిరిసిల్ల, వెలుగు: ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లాలో కేంద్ర బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ , కేంద్ర బలగాల ఫ్లాగ్ మార్చ్ కవాతును ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..అసెంబ్లీ ఎన్నికలకు శాంతి భద్రతల సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
జిల్లాకు 200 మందితో కూడిన కేంద్ర బలగాలు వచ్చాయని, త్వరలో మరిన్ని బలగాల వస్తాయని అన్నారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల పై దృష్టి పెడతామన్నారు. ఫ్లాగ్ మార్చ్ లో కమాండెంట్, అడిషనల్ కమాండెంట్, డీఎస్పీ ఉదయ్ రెడ్డి, సీఐ ఉపేందర్, ఆర్ఐ యాదగిరి, ఎస్ఐలు, సిబ్బంది, పాల్గొన్నారు.