ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలి : ఎస్పీ అఖిల్ మహాజన్

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత  నియమాలను పాటించాలి : ఎస్పీ అఖిల్ మహాజన్

సిరిసిల్ల టౌన్, వెలుగు: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్-రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారకు కృషి చేయాలని ఎస్పీ అఖిల్​మహాజన్​ పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం సిరిసిల్ల పట్టణంలోని కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా బతుకమ్మ ఘాట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు చేసే చిన్న చిన్న తప్పిదాలు వారి జీవితాలను తలకిందులు చేస్తాయన్నారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం బాధ్యతగా భావించాలన్నారు. ర్యాలీలో డీఎస్పీ చంద్రశేఖర్‌‌‌‌రెడ్డి, సీఐలు కృష్ణ, వీరప్రసాద్, ఆర్ఐ రమేశ్, ఎస్ఐలు, సిబ్బంది పట్టణ ప్రజలు,యువకులు పాల్గొన్నారు..

వేములవాడ రూరల్‌‌/వేములవాడ/కోనరావుపేట: వెలుగు: రోడ్డు భద్రతా ఉత్సవాల్లో భాగంగా వేములవాడ రూరల్‌‌ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వట్టెం గ్రామం నుంచి ఫాజుల్​నగర్‌‌‌‌ వరకు హెల్మెట్‌‌ ధరించి పోలీసులు బైక్‌‌ ర్యాలీ నిర్వహించారు. కోనరావుపేట మండలకేంద్రంలో బస్టాండ్‌‌ నుంచి గాంధీ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి మాట్లాడుతూ ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని సూచించారు. వేములవాడ పట్టణంలో తిప్పాపూర్‌‌‌‌ బస్టాండ్‌‌ నుంచి పోలీస్‌‌స్టేషన్‌‌ వరకు బైక్‌‌ ర్యాలీ నిర్వహించారు.