
గుడిహత్నూర్, వెలుగు: పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గుడిహత్నూర్ పోలీసు స్టేషన్‌ను మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లో నమోదు అయ్యే కేసులను ఎస్‌ఐ మహేందర్‌ను అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్, రికార్డు రూం, పరిసరాలను పరిశీలించారు. ఉట్నూర్ ఏఎస్పీ కాజల్, ఇచ్చోడ సీఐ భీమేశ్, ఎస్‌ఐ మహేందర్, పోలీసు సిబ్బంది ఉన్నారు.