- వాహనాలతో పట్టుబడిన మైనర్ల పేరెంట్స్కు కౌన్సెలింగ్
రాజన్నసిరిసిల్ల, సిరిసిల్ల టౌన్ , వెలుగు: మైనర్లకు వాహనాలిస్తే పేరెంట్స్ , యజమానులపై కేసులు పెడతామని రాజన్నసిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. వాహనాలు నడుపుత పట్టుబడిన మైనర్లు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మైనర్ డ్రైవింగ్ లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 361 వాహనాలను సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు తెలియని మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించవద్దని, తెలిసీతెలియని డ్రైవింగ్ తో వారు ప్రమాదాలకు కారణమవుతున్నారన్నారు.
స్కూళ్లలో విద్యార్థులకు రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ క్లాసెస్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు సదన్ కుమార్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఎస్.ఐలు సిబ్బంది పాల్గొన్నారు.