మహాశివరాత్రి జాతరకు 1500 మందితో బందోబస్తు : ఎస్పీ అఖిల్ మహాజన్

మహాశివరాత్రి జాతరకు 1500 మందితో బందోబస్తు : ఎస్పీ అఖిల్ మహాజన్

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయంలో 25 నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న మహా శివరాత్రి జాతరలో 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేయనున్నట్లు ఎస్పీ అఖిల్‌‌‌‌‌‌‌‌మహాజన్‌‌‌‌‌‌‌‌ తెలపిఆరు. వివిధ జిల్లాల నుంచి జాతర బందోబస్తుకు వచ్చిన పోలీసులతో వేములవాడలోని ఓ ఫంక్షన్‌‌‌‌‌‌‌‌హాల్‌‌‌‌‌‌‌‌లో కోఆర్డినేషన్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు ప్రశాంతంగా స్వామిని దర్శించుకునేలా పోలీసులు సహకరించాలన్నారు.

 బందోబస్త్‌‌‌‌‌‌‌‌ను 7 సెక్టార్లుగా విభజించామని, వీరంతా మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారన్నారు. దేవస్థానం వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండి భక్తులు క్యూలైన్ పాటించేలా చూడాలన్నారు. 24 గంటలు నిఘా ఉంచాలని, ఏదైనా ఇబ్బందులు తలెత్తితే కంట్రోల్ రూంకు తెలియజేయాలన్నారు. జాతరకు భారీగా వాహనాలు వచ్చే అవకాశముందని ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌, వాహనాల పార్కింగ్‌‌‌‌‌‌‌‌ పకడ్బందీగా చేపట్టాలన్నారు. సమావేశంలో అడిషనల్‌‌‌‌‌‌‌‌ ఎస్పీ చంద్రయ్య, ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సీఐలు, ఎస్‌‌‌‌‌‌‌‌ఐలు పాల్గొన్నారు.