డ్రగ్స్ రహిత సమాజం కోసం స్పెషల్ డ్రైవ్స్

డ్రగ్స్ రహిత సమాజం కోసం  స్పెషల్ డ్రైవ్స్

రాజన్న సిరిసిల్ల/కోనరావుపేట, వెలుగు:  డ్రగ్స్ రహిత సమాజం కోసం స్పెషల్​ డ్రైవ్​ చేపట్టామని  ఎస్పీ అఖిల్ మహజన్ ఆదివారం తెలిపారు. జిల్లాలో గంజాయి తాగే వారిని పట్టుకునేందుకు గంజాయి కిట్ల సహాయంతో  తనిఖీలు నిర్వహించామన్నారు.  ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.  రెండు రోజుల్లో  ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి  600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు.   

గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని గంజాయి కి సంబంధించిన సమాచారం డయల్ 100 లేదా టాస్క్ ఫోర్స్ సీఐ ఫోన్ నం.8712657392 కి సమాచారం అందించాలని  కోరారు.