సైబర్​ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ అఖిల్ ​మహాజన్​

సైబర్​ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ అఖిల్ ​మహాజన్​

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: సైబర్​ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్​సూచించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సైబర్ క్రైం జరిగిన వెంటనే నేషనల్ సైబర్ క్రైం హెల్ప్ లైన్ నంబర్ 1930కి ఫోన్ చేయాలన్నారు. వారం రోజుల్లో 15 సైబర్ ఫిర్యాదులను స్వీకరించామని, వీటిలో ఎక్కువగా ఫేక్ స్టాక్ మార్కెటింగ్, ఫేక్ జాబ్ ఆఫర్స్, జాబ్ ఫ్రాడ్, లోన్ ఫ్రాడ్, డిజిటల్ ఆరెస్ట్, ఏపీకే ఫైల్స్ వే ఉన్నట్లు పేర్కొన్నారు. సైబర్ క్రైం జరిగిన మొదటి గంటలోపు ఫిర్యాదు చేస్తే స్కామర్ అకౌంట్ ను ఫ్రీజ్ చేసి, డబ్బులు రికవరీ చేయవచ్చని చెప్పారు.