
మెట్‌పల్లి, వెలుగు: జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్ గురువారం అర్ధరాత్రి మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాత్రి వేళ పెట్రోలింగ్, గస్తీ పరిస్థితిని పరిశీలించారు. జీడీ బుక్ పరిశీలించి స్టేషన్‌లోని సిబ్బంది వివరాలు, విధులను అడిగి తెలుసుకున్నారు.
రాత్రి డ్యూటీ వివరాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్పీ అర్ధరాత్రి తనిఖీలు చేయడంతో అధికారులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.