క్రీడలతో ఫిట్​నెస్​ పెరుగుతుంది

జగిత్యాల టౌన్, వెలుగు:  నిత్యం బిజీగా ఉండే పోలీసులకు క్రీడలు మానసిక, శారీరక దృఢత్వాన్ని కలిగిస్తాయని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. గురువారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ మైదానంలో పోలీసు వార్షిక క్రీడలను ప్రారంభించారు. అనంతరం స్పోర్ట్స్ జెండాను ఆవిష్కరించి బెలూన్లను గాలిలోకి వదిలారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల ఉద్యోగుల మధ్య ఐక్యత పెరుగుతుందన్నారు.

 రెండు రోజులపాటు జరిగే పోటీల్లో వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్‌, అథ్లెటిక్స్,  క్యారం, చెస్ క్రీడలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అడిషనల్ ఎస్పీ భీమ్ రావు, డీఎస్పీలు రఘుచందర్, రాములు, రంగారెడ్డి, ఏవో శశికళ, సీఐలు, ఎస్ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.

కోనరావుపేట,వెలుగు: క్రీడలతో స్నేహభావం పెరుగుతుందని బీజేపీ కోనరావుపేట మండల అధ్యక్షుడు మిర్యాల్కర్ బాలాజీ అన్నారు. గురువారం వట్టిమల్లలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. 

ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడలపై దృష్టి సారించాలన్నారు. అనంతరం బాలాజీని గ్రామ లీడర్లు, యువకులు సన్మానించారు. కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు సురేశ్‌ గౌడ్, లీడర్లు జెట్టి విజయ్, సుధాకర్, శేఖర్, శ్రీకాంత్, శ్రీనివాస్, హనుమండ్లు, జలపతి, వేణు పాల్గొన్నారు.