జగిత్యాలలో పెరిగిన సైబర్ మోసాలు

జగిత్యాలలో పెరిగిన సైబర్ మోసాలు
  • గతేడాది కన్నా పెరిగిన కేసులు
  • జగిత్యాల టౌన్ లో ఆత్యధికంగా 781 కేసులు
  • 1,289 సైబర్ కేసుల్లో రూ. 8 కోట్లు మోసపోయిన బాధితులు 
  • యాన్యువల్   క్రైం రిపోర్ట్ ను వెల్లడించిన ఎస్పీ అశోక్ కుమార్ 

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ లో ఎస్పీ అశోక్ కుమార్ ఏడాదిలో జరిగిన నేరాల నివేదికను విడుదల చేశారు. సైబర్ నేరాలు భారీగా పెరిగినట్లు తెలిపారు. జిల్లాలో  ఏకంగా 1289 కేసుల్లో రూ. 8 కోట్లకు పైగా సైబర్ మోసాలు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాకు యాన్యువల్ రిపోర్టును వెల్లడించారు. 

Also Read :- యాసంగి పంటకు నీళ్లిస్తాం.. రైతాంగానికి ఆఫీసర్ల భరోసా

పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లకు వచ్చిన ఫిర్యాదులను వెంటనే కేసులు నమోదు చేస్తూ ఇన్వేస్టిగేషన్ స్పీడప్ చేయడంతో క్రైం రేట్ తగ్గిస్తున్నామన్నారు.  2022 లో 5056  కేసులు, 2023లో 4999, 2024 లో 5919 కేసులు నమోదయ్యాయి.  2023తో  పోలిస్తే 2024 లో 920  కేసులు పెరిగాయి.  జిల్లాలోని  జగిత్యాల టౌన్  పీఎస్ లో అత్యధికంగా 791 కేసులు నమోదు కాగా అతి తక్కువగా బీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ పీఎస్‌‌‌‌‌‌‌‌లో 120 కేసులు నమోదయ్యాయని చెప్పారు.  

పెరిగిన చోరీలు..  తగ్గిన దోపిడీలు 

జిల్లాలో 2022లో 68 ఇండ్ల లో తాళాలు పగల గొట్టి చోరీలు జరగ్గా.. 2023 లో 125 చోరీలు, 2024 లో 158 చోరీలు జరిగాయి. గత ఏడాది తో పొలిస్తే 33 చోరీలు పెరిగాయి. 2022 లో 25 దోపిడీలు, 2023 లో 21 , 2024 లో 14 దోపిడీ కేసులు నమోదయ్యాయి. 2022లో 29 మర్డర్లు, 2023లో 28 మర్డర్లు, 2024 లో 28 మర్డర్లు  కాగా కేసులు నమోదు చేశారు. 2022 లో 72 హత్యాయత్నం  కేసులు, 2023 లో 64, 2024 లో 48 కేసులు నమోదయ్యాయి.  2022 లో 26, 2023 లో 48, 2024 లో 57 కిడ్నాప్ కేసులు నమోదు చేశారు. 2022 లో 35 రేప్ కేసులు, 2023 లో 45, 2024 లో 40 రేప్ కేసులయ్యాయి. 

8.58 కోట్ల సైబర్ చీటింగ్

702 మంది పై 438 కేసులు నమోదు చేసి 428 వెహికిల్ ను సీజ్ చేశారు. పేకాట ఆడుతున్న 602 మంది పై 89 కేసులు నమోదు చేసి రూ. 19 లక్షల నగదును సీజ్ చేశారు.  2024 లో 1,289 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా ఈ కేసుల్లో బాధితులు రూ. 8.58 కోట్లు మోసపోయారు. వీటిలో రూ. 1.12 కోటి రికవరీ చేయగా రూ. 1. 27 కోట్లు హోల్డ్ 
చేశారు.