మెట్ పల్లి, వెలుగు: అక్రమ వ్యాపారాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠినంగా వ్యవహరించాలని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. సోమవారం మెట్‌పల్లి డివిజన్ ఆఫీసులో మెట్ పల్లి, కోరుట్ల సర్కిల్ క్రైమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇటీవల జిల్లా, రాష్ట్ర సరిహద్దుల్లో గంజాయి సరఫరాపై నిఘా పెట్టాలన్నారు.
మట్కా, ఇసుక అక్రమ రవాణా, పేకాట, గుడుంబా, పీడీఎస్ రైస్ రవాణాను అరికట్టాలన్నారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలనన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఉమా మహేశ్వర రావు, సీఐలు నిరంజన్ రెడ్డి , సురేశ్, డీసీఆర్‌బీ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్ , లక్ష్మీనారాయణ, ఎస్‌ఐలు చిరంజీవి, అనిల్, కిరణ్ కుమార్, రాజు, శ్రీకాంత్, శ్వేత, నవీన్, గీత, డీసీఆర్‌బీ, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
సీసీ కెమెరాల ప్రారంభం
శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. సోమవారం మెట్‌పల్లి పట్టణంలోని సుభాష్ నగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాల నియంత్రణతో పాటు నేరస్తులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు.
ఇటీవల రెండేళ్ల బాబు కిడ్నాప్ కేసును కూడా సీసీ కెమెరాల సాయంతో ఛేదించినట్లు గుర్తుచేశారు. రానున్న గణేశ్ నవరాత్రుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు సంగు గంగాధర్, బొడ్ల అనిల్, హన్మాండ్లు, రాజేశ్వర్ గౌడ్, బొడ్ల రమేశ్, ప్రవీణ్ , రాజారెడ్డి, లింగం, హన్మాండ్లు, రాజు, లింబాద్రి, భూమారెడ్డి
పాల్గొన్నారు.