ఆన్​లైన్​ మోసాలపై అవగాహన కల్పించాలి : ఎస్పీ రోహిత్​ రాజు

ఆన్​లైన్​ మోసాలపై అవగాహన కల్పించాలి : ఎస్పీ రోహిత్​ రాజు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఆన్​లైన్​మోసాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని ఎస్పీ బి.రోహిత్​ రాజు అధికారులకు సూచించారు. చుంచుపల్లి పోలీస్​స్టేషన్​లోని డిస్ట్రిక్ట్​ సైబర్ ​క్రైమ్స్​కో ఆర్డినేషన్ ​సెంటర్​ను ఆయన శుక్రవారం సందర్శించారు. జిల్లాలో పోలీస్​ స్టేషన్ల వారీగా సైబర్​ క్రైమ్స్​ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్​ నేరాలపై నిత్యం అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. 

ఆన్​లైన్​ మోసాలకు గురైనవారు వెంటనే పోలీస్​లకు కంప్లైంట్​ ఇస్తే న్యాయం జరుగుతుందని చెప్పారు. అనంతరం పోలీస్​ స్టేషన్​ను తనిఖీ చేశారు. స్టేషన్​ కు వచ్చే బాధితులతో మర్యాదగా మెలగాలని పోలీసులకు సూచించారు. పెండింగ్​లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రోగ్రాంలో చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, సైబర్​ క్రైమ్స్​ ఇన్​ స్పెక్టర్ ​జితేందర్, ఎస్సైలు రవి, జుబేదా బేగం పాల్గొన్నారు.