భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మావోయిస్టులకు సహకరించే వారిపై చర్యలు తప్పవని తునికాకు కాంట్రాక్టర్లు, వ్యాపారులకు ఎస్పీ బి. రోహిత్ రాజు హెచ్చరించారు. కొత్తగూడెంలోని ఎస్పీ ఆఫీస్లో తునికాకు కాంట్రాక్టర్లు, వ్యాపారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఛత్తీస్ గఢ్ సరిహద్దు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన తునికాకు కాంట్రాక్టర్లు, వ్యాపారులు అలర్ట్ ఉండాలన్నారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తునికాకు సేకరణపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులకు ఏ మాత్రం నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మావోయిస్టుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకు ఇవ్వాలని సూచించారు.