
మెదక్టౌన్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి, శోభాయాత్రలు శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ బాలస్వామి సూచించారు. ఆదివారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ.. శోభాయాత్ర సమయంలో ఇతరుల మనోభావాలను కించపర్చరాదన్నారు. అభ్యంతరకరమైన పోస్టులు, సోషల్ మీడియాల్లో ప్రచారం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ర్యాలీ సమయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ ద్వారా 24 గంటలు పర్యవేక్షిస్తుంటామన్నారు.