
మెదక్ టౌన్, వెలుగు : ట్రాక్టర్ డ్రైవర్లు కేజ్‌వీల్స్‌తో రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ బాలస్వామి హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని ఎస్పీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ట్రాక్టర్లను కేజ్ వీల్స్‌తో బీటీ రోడ్లు, సీసీ రోడ్లపై నడిపడం వల్ల రోడ్లు డ్యామేజ్అవుతాయన్నారు. ఈ విషయంలో ట్రాక్టర్యజమానులు, డ్రైవర్లు సహకరించాలని సూచించారు. లేదంటే మోటారు వాహన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.